ఏపీ పాలిసెట్‌-2024 కౌన్సిలింగ్ ప్రారంభం

May 27,2024 12:38 #ap polycet, #Polyset-2024

ప్రజాశక్తి-యంత్రాంగం : ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ సోమవారం నాడు ఉదయం నుండి ప్రారంభమైంది. ఉదయం నుండే విద్యార్థులు వారి తల్లితండ్రులు కౌన్సిలింగ్ సెంటర్కు చేరుకున్నారు. కౌన్సిలింగ్ మొదటిరోజు ఒకటవ ర్యాంకు నుంచి 12,000 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ జరుగుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. ర్యాంకుల వారీగా నేటి నుంచి జూన్ 3వరకు ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్‌ ఆధారిత అడ్మిషన్లు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ పూర్తి చేసి అడ్మిషన్లు కల్పిస్తారు. ఎన్‌సీసీ, ఆర్మీ, స్పోర్ట్స్‌, పోలీస్, దివ్యాంగులకు మే 31నుంచి జూన్‌ 30వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

కౌన్సిలింగ్‌కు ఇవి తీసుకువెళ్తున్నారా..?

  1. ఫీజు చెల్లించిన రశీదు
  2. హాల్‌ టిక్కెట్
  3. ర్యాంక్ కార్డు
  4. పదో తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం
  5. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్
  6. అర్హులైన వారికి ఈడబ్ల్యుఎస్‌ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ,
  7. ప్రత్యేక క్యాటగిరీ పత్రాలు
➡️