AP TET 2024 : టెట్‌ ఫలితాల్లో 58.4 శాతం ఉత్తీర్ణత

Jun 25,2024 22:35 #AP TET 2024, #Results released..

– ఫలితాలు విడుదల చేసిన నారా లోకేష్‌
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2024 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మంగళవారం విడుదల చేశారు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌ పరీక్షకు 2,67,789 మంది దరఖాస్తు చేసుకోగా, 2,35,907 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,37,904 మంది (58.4 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షా ఫలితాలను పాఠశాల విద్య వెబ్‌సైట్‌ https//cse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇదే అంశంపై లోకేష్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. టెట్‌లో అర్హత సాధిస్తేనే డిఎస్‌సి రాసేందుకు అర్హులని, డిఎస్‌సిలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టెట్‌లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఇడి, డిఇడి పూర్తి చేసుకున్న వారికి కూడా అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్‌ నిర్వహించబోతున్నామని, అనంతరమే మెగా డిఎస్‌సి ఉంటుందని లోకేష్‌ పేర్కొన్నారు.

➡️