జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులుగా పాటి శివకుమార్‌ నియామకం

Feb 24,2024 09:56 #Appointments, #candidate, #YCP

ప్రజాశక్తి-రాజోలు (అంబేద్కర్‌ కోనసీమ) : కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసిపి పరిశీలకులుగా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసిపి సోషల్‌ మీడియా జిల్లా కన్వినర్‌ పాటి శివకుమార్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావవేశంలో శివకుమార్‌ మాట్లాడుతూ … ఎపిలో రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. దేశంలో ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని, ప్రస్తుతం సిఎం వైఎస్‌ జగన్‌లా పరిపాలన ఎవరూ చేయలేదన్నారు. మూడున్నరేళ్లలోనే ఏకంగా 98.44 శాతం హామీలు అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రెండేళ్లు కరోనాతో సరిపోయిందని, ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదని చెప్పారు. తనపై నమ్మకంతో ఇంతటి అవకాశం ఇచ్చిన సిఎం కు కఅతజ్ఞతలు తెలిపారు.

➡️