ఆదరించండి… అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

May 6,2024 14:26 #gowd
  • ఒంగోలు పార్లమెంట్‌ స్వతంత్య్ర అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్
    గిద్దలూరు : ఈ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అండగా వుండి నిరంతరం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఒంగోలు పార్లమెంట్‌ స్వతంత్య్ర అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్‌ వెల్లడించారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలోని అన్ని ప్రాంతాల్లో ఆయన గత కొన్నిరోజులుగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల సంఘం తనకు ఇచ్చిన కుండ గుర్తుపై తనను ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనికోరారు. గత కొన్నేళ్లుగా ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలోని పలు ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నత్తనడకన జరుగుతున్న ‘నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను పనులు వేగంగవంతంగా పూర్తయ్యేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గిద్దలూరులో రాచర్ల గేటు దగ్గర ఒంగోలులోని అగ్రహీరం సమీపంలోని రైల్వే గేటు దగ్గర బ్రిడ్జి ప్లానును పూర్తిచేయటానికి కృషిచేస్తానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే తాగునీటిని పైపుల ద్వారా గిద్దలూరుకు తరలించేందుకు తనవంతుగా కృషిచేస్తానన్నారు. ఒంగోలు నుంచి భాస్కరరావుపేట జంక్షన్‌ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కృషినన్నారు. దొనకొండ ఇండిస్టియల్‌ కారిడార్‌ అభివృద్ధికోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీఇచ్చారు. దర్శి కేంద్రంగా ఏర్పాటుచేసిన డ్రైవింగ్‌ స్కూలు పనులు పూర్తిచేస్తానన్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరంగా ఉన్న గిద్దలూరు మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను పెంచి వాటిని మార్కెటింగ్‌ వసతులు కల్పిస్తామన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని జెవి మోహన్‌గౌడ్‌ వివరించారు. డాక్టర్‌ జెవి నారాయణ తనయుడిగా గిద్దలూరు ప్రాంతంలో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. చిన్నప్పటి నుంచి ప్రజా సేవపై మక్కువ తనకు బలంగా ఉండేదన్నారు. కాలేజీ చదివే రోజుల్లోనే విద్యార్థి సమస్యలపై పోరాటాలను చేశానని వివరించారు. అప్పటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గంటున్నానన్నారు. డిగ్రీ పూర్తయిన త్వారాత ఉద్యోగం కోసం ఎదురచూడకుండా ‘పట్టభద్రుల పలహారశాల’ పెట్టి ఎందరికీ స్వయం ఉపాధికి మార్గం చూపానన్నారు. అనంతరం చిత్రసీమలో నిర్మాతగా అడుగుపెట్టి నల్లపూసలు, ఎన్‌టిఆర్‌ నగర్‌, బ్లూ వంటి సినిమాలను నిర్మించానన్నారు. చిత్ర నిర్మాతల మండలి సభ్యుడిగా నెలకొన్న సమస్యలపై ధర్నాలు చేశానన్నారు. 14 సంవత్సరాలుగా ఫిలిం చాంబర్‌ సభ్యునిగా కొనసాగుతూ సేవలను అందిస్తున్నానన్నారు. నేస్తం పౌండేషన్‌ను స్థాపించి ఎన్నో సామాజిక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని జె.వి.మోహన్‌గౌడ్‌ వివరించారు.
➡️