వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Jan 11,2024 15:01 #adjourned, #telangana high court

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరించనుంది. ‘వ్యూహం’కు సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ఆ సినిమా నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే, తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా చిత్రీకరించిన ‘వ్యూహం’ సినిమా ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ లోకేశ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

➡️