ఆటో బోల్తా పడి ఒకరు మృతి – మరొకరి పరిస్థితి విషమం

Jun 13,2024 09:55 #Kurnool, #road accident

ప్రజాశక్తి-ఆలూరు : ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద హోతుర్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా పడటంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం ఆలూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోద్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️