ఈనెల 9, 10 తేదీల్లో ప్రకాశంలో ‘బాలోత్సవం’

Feb 7,2024 13:18 #Balotsavam, #prakasam, #this month

ప్రకాశం : ఈనెల 9, 10 తేదీల్లో ప్రకాశం జిల్లాలో బాలోత్సవం పిల్లల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం ‘ప్రకాశం బాలోత్సవం – ప్రధమ పిల్లల పండగ’ అనే కార్యక్రమంలో నిర్వాహకులు విలేకరులతో సమావేశమై వివరాలు వెల్లడించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు బాలోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.

➡️