బాపట్ల జిల్లా ఎడ్ల జతకు ప్రథమ స్థానం

  •  రామపురంలో ఘనంగా పట్టాభిరామ స్వామి తిరుణాళ్ల

ప్రజాశక్తి-సిఎస్‌పురం (ప్రకాశం జిల్లా) : శ్రీపట్టాభిరామస్వామి తిరుణాళ్ల సందర్భంగా ప్రకాశం జిల్లా సిఎస్‌పురం మండలం రామాపురంలో ఎడ్ల పందాలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఈ పోటీలు జరిగాయి. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన ఐదు జతల ఎడ్లు ఇందులో పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన పావులూరి వీరస్వామి చౌదరి ఎడ్ల జత 15.89 అడుగులు లాగి రూ.50 వేల రూపాయల ప్రథమ బహుమతి సాధించాయి. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మక్కెన కోటేశ్వరరావు ఎడ్ల జత 15.51 అడుగులు లాగి రూ.40 వేల ద్వితీయ బహుమతి పొందాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేటకు చెందిన మీనిగా కాశయ్య ఎడ్ల జత 11.57 అడుగు లాగి రూ.30 వేల రూపాయల తృతీయ బహుమతి సాధించాయి. మిగతా రెండు జతలకు ప్రోత్సాహం కింద రూ.ఐదు వేల చొప్పున బహుమతి అందజేశారు.

➡️