వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్చల్‌

Apr 2,2024 11:14 #elugu banti, #srikakulam

ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం) : జిల్లాలోనివజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి ఎలుగుబంటి చొరబడి హల్చల్‌ చేసింది. గమనించిన స్థానికులు ఆ పరిసరాల నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఎలుగుబంటి బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక వైద్య, అటవీ బృందాల సాయంతో బంధించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు మతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

➡️