బడ్జెట్‌లో రైతాంగానికి ద్రోహం : మాజీ ఎంపి వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పి రైతులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టుబానిసలుగా చేసే విధానాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడం రైతాంగానికి ద్రోహం చేయడమేనని మాజీ ఎంపి వడ్డే శోభనాద్రీశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. గతంలో మూడు నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా చేద్దామని అనుకున్న పనిని ఈ పేరుతో చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు పండించే పంటల సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇస్తామని గానీ, నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేస్తామని గానీ, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకుంటామని గానీ, ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించబోమని చెప్పలేదని పేర్కొన్నారు.

➡️