సిపిఎం అభ్యర్థి బాబురావుని గెలిపించాలంటూ … బైక్‌ ర్యాలీ

Apr 30,2024 12:28 #bike rally, #CPM candidate Baburao

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్‌ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావుకి మద్దతు తెలుపుతూ … మంగళవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కండ్రిక బస్టాండ్‌ నుండి సత్యనారాయణపురం వరకు ర్యాలీ కొనసాగింది.

దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బిజెపి, వైసిపి ప్రభుత్వాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం-విజయవాడను అభివఅద్ధి చేసుకుందాం.. ఆదాని అంబానీ లకు దేశాన్ని తాకట్టు పెట్టిన బిజెపి దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలను ఓడించాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. మోడీ బిజెపి పార్టీలను ఓడించాలని ఇండియా వేదిక కూటమిగా కాంగ్రెస్‌, సిపిఐ, ఆర్‌జెడి ఆమ్‌ ఆద్మీ, తదితర పార్టీలు ఏకమై బిజెపికి మద్దతు తెలుపుతున్న పార్టీలను ఓడిద్దాం అని పిలుపునిచ్చారు. సెంట్రల్‌ సిటీ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ … చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వం విధానం బాగా ఉందని చెప్పటం దారుణం అన్నారు. మోడీ విజన్‌ చంద్రబాబుకు నచ్చటం ఏమిటి అని ప్రశ్నించారు. మోడీ విజన్‌ చంద్రబాబుకు ఏమి నచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. మోడీ మూడోసారి గెలిస్తే దేశం, రాష్ట్రం రెండూ నాశనం అయిపోతాయని తెలిపారు. జైల్లో పెడితే బిజెపి మోడీకి చంద్రబాబు లంగుపోయారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యతను ఇస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో బిజెపికి నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయని చంద్రబాబు జగన్‌ కేసుల కోసం మోడీకి లంగిపోయారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ కి ఓట్లు వేస్తే మోడీకి వేసినట్లే అని తెలిపారు. మోడీని గద్దిదించాలని అసెంబ్లీకి సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావును గెలిపించాలని, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌ ను గెలిపించాలని భారీ మెజార్టీతో గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత మోడీ రాష్ట్రానికి వచ్చి చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చారన్నారు. ప్రజలకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దారుణం అన్నారు. మోడీ చంద్రబాబు నాయుడు ఆనాడు రాజధాని కట్టకుండా గ్రాఫిక్స్‌ లో చూపించి ప్రజలను మోసం చేశారు అన్నారు. వైసిపి ప్రభుత్వం ఒక్క రాజధాని కట్టలేదు గాని ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు వైజాగ్‌ నుండి పరిపాలన చేస్తే విజయవాడ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. విజయవాడలో సరైన పరిశ్రమలు, వ్యాపారాలు లేకపోవడం దారుణం అన్నారు. విజయవాడ అభివఅద్ధి చెందాలి అంటే కమ్యూనిస్టులను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని గతంలో కమ్యూనిస్టులు కార్పొరేటర్‌ గా ఉన్న సమయంలో అనేక అభివఅద్ధి పనులు చేశామని సింగ్‌ నగర్‌ బ్రిడ్జి వాంబే కాలనీ కండ్రిక రాజీవ్‌ నగర్‌ తదితర ప్రాంతాలలో తక్కువ రేటుకే రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చామని గుర్తు చేశారు. విజయవాడ అభివఅద్ధి చెందాలంటే సిపిఎం అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలని కోరారు. చెత్త పన్ను పోవాలన్నా కరెంటు బిల్లు నీటి పన్ను నిత్యవసర సరుకులు తగ్గాలన్న సిపిఎంకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ విజయవాడ నగరం అభివృ ద్ధి చెందిందంటే కమ్యూనిస్టుల ద్వారా అని ఆనాడు కమ్యూనిస్టులు కార్పొరేటర్‌ గా పనిచేసిన సమయంలో సింగ్‌ నగర్‌ బ్రిడ్జి గాని వాంబే కాలనీ పట్టాలు గాని కంట్రీగా రాజీవ్‌ నగర్‌ పాయకాపురం తదితర ప్రాంతాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించుకునే వరకు పోరాడి వారి అభివఅద్ధి కోసం నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలపై పోరాడుతూ వారిని అభివఅద్ధి బాటలో నడుపుతూ కార్పొరేటర్లు ఎంతో కఅషి చేశారని అదేవిధంగా ఇంకా అభివఅద్ధి చెందాలి అంటే సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు గెలిపించాలని కోరారు.

విజయవాడ ఇండియా వేదిక కూటమి బలపరిచిన విజయవాడ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌ మాట్లాడుతూ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న పార్టీలను ఓడించాలని బిజెపి మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న టిడిపి జనసేన వైసిపి పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు నరహర శెట్టి నరసింహారావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కే శ్రీదేవి సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణా ఆర్జెడి నాయకులు ప్రవీణ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు గురునాథం సిపిఐ నాయకులు భాస్కరరావు సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి రమణ రావు అధ్యక్షులు కే దుర్గారావు సిపిఎం నాయకులు ఆండ్రా మాలాద్రి సిపిఎం సిపిఐ కాంగ్రెస్‌ ఆర్జెడి హమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

➡️