బోల్తాపడ్డ బొలెరో వాహనం – 20మంది కూలీలకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

విడపనకల్‌ (అనంతపురం) : బొలెరో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పి బోల్తాపడటంతో 20మంది కూలీలకు గాయాలవ్వగా, వారిలో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం అనంతపురం జిల్లాలో జరిగింది.

ఒట్టి మిరపకాయలు పీకడానికిగాను 40మంది కూలీలు బొలెరో వాహనంలో వజ్రకరూరు నుండి విడపనకల్‌ మండలం పాల్తూ గ్రామానికి వెళుతుండగా, టైరు పంక్చరయ్యి వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20మంది కూలీల చేతులు, కాళ్లు , తలలకు గాయాలయ్యాయి. వారిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️