వైసిపిని వీడేందుకు సిద్ధమైన బొప్పన భవకుమార్‌

Jan 13,2024 14:33 #boppana bhavakumar, #resigns, #YCP

విజయవాడ: వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో బుజ్జగించేందుకు దేవినేని అవినాష్‌, ఇతర నేతలు ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా భవకుమార్‌ మాట్లాడుతూ.. ‘పార్టీ వీడొద్దంటూ నాపై తీవ్ర ఒత్తిడి ఉంది. టిడిపి నేతలతోనూ సంప్రదిస్తున్నా. కార్యకర్తలు, శ్రేమోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతా. వైసిపిని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన బప్పన భవకుమార్‌.. 2019 నుంచి నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

➡️