సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి పిలుపు – ఎపివి జెఎసి నేతలు అరెస్ట్

Mar 1,2024 10:37 #APV Jac, #call, #CM camp office, #Protest

అమరావతి : ‘ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ‘ నినాదంతో …. జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విద్యార్థి, యువజన రాష్ట్ర జెఎసి లు శుక్రవారం ఉదయం సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈరోజు ఉదయం సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పోతినవెంకట రామారావు, చలసాని శ్రీనివాస్‌, తదితరులు కలిసి బయలుదేరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, పెట్రోలియం ఉత్పత్తులపై ఎపి వాటా తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ … నేతలు నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రానారావు, చలసాని శ్రీనివాస్‌ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

➡️