అభ్యర్థులకు సిసి టివి లింక్‌పై వివరాలివ్వండి

May 24,2024 22:42 #2024 elction, #AP High Court
  •  స్ట్రాంగ్‌ రూమ్‌ల చుట్టూ సిసి కెమెరాల ఏర్పాట్ల వివరాలివ్వండి : ఇసికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి :ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఏర్పాటుచేసిన సిసి టివి లింక్స్‌ను ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరికీ ఇవ్వడంపై వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన విధంగా సిసి టివి లింక్స్‌ ఇచ్చే విషయంపై పూర్తి వివరాలు నివేదించాలని పేర్కొంది. స్ట్రాంగ్‌ రూమ్‌లకు అన్ని వైపులా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలనే వినతులపై తీసుకున్న చర్యలు నివేదించాలని కూడా ఆదేశించింది. సిసి టివి లింక్స్‌ అభ్యర్థులందరికీ అవకాశం కల్పించాలన్న కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనలను విధిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, విశాఖ ఎంపి అభ్యర్థి కెఎ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

➡️