భారీ మెజార్టీ సాధించిన అభ్యర్థులు

Jun 5,2024 00:55 #JanaSena, #TDP
  • విశాఖ పార్లమెంట్‌ 5,04,247, గాజువాక అసెంబ్లీ 95,235 ఓట్లు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో పలువురు అభ్యర్ధులు ఎవరూ ఊహించనంతగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. టిడిపి కూటమి క్లీన్‌ స్లీప్‌ చేయడంతో పాటు పలువురు అభ్యర్ధులు భారీ మెజార్టీని నమోదు చేసుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల మెజార్టీ కంటే ఎక్కువ సాధించిన అభ్యర్ధులు గణనీయంగానే ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గాజువాక టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన తర్వాత భారీ మెజార్టీని భీమిలి టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్లు సాధించారు. మంగళగిరి నుంచి టిడిపి అభ్యర్థి నారా లోకేష్‌ 91,413 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోటీ చేసిన మహిళా అభ్యర్థులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాధవి 51,150 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ల మెజారిటీ
పార్టీ అధ్యక్షులుగా విజయం సాధించిన వారిలో కుప్పం నుంచి చంద్రబాబునాయుడు 48,006 ఓట్లతో గెలుపొందారు. పులివెందుల నుంచి వైసిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి 61,687తో గెలుపొందారు.. పిఠాపురం జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ 70,279 ఓట్లతో గెలుపొందారు.

➡️