కారు ప్రమాదం ఘటనపై మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కేసు

Jan 17,2024 14:49 #hyderabad, #road accident

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజాభవన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్‌ కుమారుడు సాహిల్‌ గత నెల కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను డీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దఅష్టికి వెళ్లడంతో కేసు నుంచి సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సీఐ దుర్గారావును సస్పెండ్‌ చేశారు. ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌కు నోటీసులు జారీ చేశారు. సీఐని మభ్యపెట్టినందుకు షకీల్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఘటనలో మొత్తం 10మందిపై కేసులు నమోదు చేయగా, ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత సాహిల్‌ దుబారు పారిపోయాడు. దీంతో పోలీసులు లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. అప్పటికే దుబారులో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్‌.. తన కుమారుడిని దుబారుకి పిలిపించుకున్నాడు. తాజాగా షకీల్‌తో పాటు మరో ఇద్దరిపైనా లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

➡️