రూ.11.45 లక్షల నగదు పట్టివేత

Apr 2,2024 22:37 #2024 elections, #money, #sized

ప్రజాశక్తి-యంత్రాంగం :ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. రూ.11.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద రూ.6.15 లక్షలు, రాయదుర్గం పట్టణం కణేకల్లు రోడ్డు వద్ద రూ.2.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో సీజ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు కూడలి వద్ద ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వెంకటరావు ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి రూ.2.50 లక్షల నగదును పట్టుకున్నారు. మందస మండలం స్రవంతి రెంటికోట నుంచి పలాసవైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

➡️