బాలయ్య నివాసంలో సంబరాలు

Jun 4,2024 12:06 #Balayya, #Celebrations, #residences

ప్రజాశక్తి-హిందూపురం (అనంతపురం) : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 6 వ రౌండ్‌ ముగిసేసరికి నందమూరి బాలకృష్ణ 12713 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి రౌండ్‌ లోను బాలకృష్ణ ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి నాయకులంతా బాలయ్య నివాసానికి వెళ్లి సంబరాలు జరుపుకొని ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటున్నారు. ముచ్చటగా మూడవసారి భారీ మెజారిటీతో బాలకృష్ణ హ్యాట్రిక్‌ దిశగా దూసుకుపోతున్నారు.

➡️