ప్రధాని మోడి-అమిత్‌షాలకు చంద్రబాబు ఫోన్‌

అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోడి, కేంద్ర మంత్రి అమిత్‌ షా లకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. ఎన్‌డిఎ కూటమి అత్యధిక సీట్లు సాధించడంపై ఇద్దరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎపిలో ఎన్‌డిఎ కూటమి ఘన విజయంపై చంద్రబాబుకు ప్రధాని మోడి, అమిత్‌ షాలు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

➡️