ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? – సిఎం జగన్‌కు చంద్రబాబు ప్రశ్న

Apr 27,2024 22:21 #ap cm jagan, #chandrababu, #coments, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో మద్యపానంపై నిషేదం విధించకుండా ఓట్లు ఎలా అడుగుతారని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 నాటి ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపానంపై నిషేదం విధిస్తామని జగన్‌ హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. మద్యపాన నిషేదం అమల్జేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని అప్పట్లో ప్రకటించిన జగన్‌ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. ‘మేనిఫెస్టోను మత గ్రంథాలుగా పేర్కొన్న మీరు..వాటిపై ఏమాత్రం గౌరవమున్నా..మద్యపాన నిషేదం అమల్జేసివుండేవారు. కానీ మాట తప్పారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?’ అని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు.

➡️