ఓట్లలో వైసిపి అవకతవకలు : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి చంద్రబాబు లేఖ

chandrababu letter to ec on voter list

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అధికార పార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు శుక్రవారం లేఖ రాశారు. ఎలక్టోరల్‌ మాన్యువల్‌-2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు జరగడం లేదని తెలిపారు. మాన్యువల్‌ ప్రకారం జనాభా పరమైన సారూప్య ఎంపికలు, ఫొటోగ్రాఫిక్‌ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్‌ ఎంట్రీలను తొలగించాలని కోరారు. డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్టులో మరణించిన వారి ఓట్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోర్స్‌ రూల్స్‌-1960 ప్రకారం ఓట్లను ఇంటి నెంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలని, కానీ నేటికీ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అర్హత లేని వారికి సైతం ఫామ్‌-6 ద్వారా ఆన్‌లైన్‌లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. నేరుగా కానీ, ఆన్‌లైన్‌లో కానీ బల్క్‌గా ఫామ్‌-7 దరఖాస్తులను స్వీకరించొద్దని కోరారు. కొనిు నియోజకవర్గాల్లో ఎటువంటి విచారణ చేయకుండా తెల్లపేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారని వివరించారు. ఇఆర్‌ఒలు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్టు ప్రకటించి నెల గడుస్తునాు పైన పేర్కొను అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. తుది జాబితాలో ఓట్ల అవకతవకలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇఆర్‌ఒలకు, డిఇఒలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.

➡️