మోడీ నామినేషన్‌లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్‌ కార్యక్రమంలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ పాల్గోనున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున మోడీ మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్‌ సోమవారమే వారణాసికి చేరుకున్నారు. చంద్రబాబు మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి వారణాసికి వెళ్లనున్నారు.

➡️