రాంగ్‌ రూట్లో చంద్రబాబు హెలికాప్టర్‌… అప్రమత్తం చేసిన ఏటీసీ

Jan 20,2024 14:23 #helicopter, #Nara Chandrababu

ప్రజాశక్తి-విశాఖ : టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారితప్పింది. చంద్రబాబు హెలికాప్టర్‌కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలెట్‌ను అప్రమత్తం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలో హెలికాప్టర్‌ వెళ్లడం లేదని, రాంగ్‌ రూట్లో వెళుతోందని ఏటీసీ చంద్రబాబు హెలికాప్టర్‌ పైలెట్‌కు వివరించింది. ఏటీసీ హెచ్చరికలతో చంద్రబాబు హెలికాప్టర్‌ వెంటనే వెనుదిరిగింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతించడంతో చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు.

➡️