తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన : ఎంపీ కేశినేని

ప్రజాశక్తి-విజయవాడ : తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కేశినేని భవన్‌ లో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. దేశచరిత్రలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని గుర్తుచేశారు. ఈ దేశంలో ఎన్టీఆర్‌ తెచ్చిన సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదన్నారు. చంద్రబాబును ఎవరూ పట్టించుకోరు.. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రాడు అంటూ వ్యాఖ్యానించారు. 2014లో గెలిచాక చంద్రబాబు ఏవో అద్భుతాలు చేస్తాడని మేం భావించాం.. కానీ, కేవలం తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందని విమర్శించారు.

➡️