గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Mar 9,2024 10:33 #Cheetah, #death, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు : గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్లే మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని వారికి చిరుత కళేబరాన్ని అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

➡️