చల్లబడిన హైదరాబాద్‌ – పలుచోట్ల వాన

Apr 20,2024 09:13 #hyderabad, #many places, #Rain

హైదరాబాద్‌ : ఎండ తీవ్రత ఉక్కపోతతో వేడెక్కిన హైదరాబాద్‌ నగరం చల్లబడింది. వాతావరణం మబ్బుకమ్మి వాన కురియడంతో నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. నగరంలో పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్‌, తుర్కయాంజల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణీకుల ఇబ్బందులుపడ్డారు.

➡️