హెబిఎస్‌ కార్పస్‌ పిటిషన్‌ మూసివేత

Apr 29,2024 21:23 #AP High Court
high court on sand mining

ప్రజాశక్తి-అమరావతి : గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి విడదల రజిని అనే ఎస్‌సి మహిళను అధికార పార్టీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణను మూసేసింది. సోమవారం కోర్టులో రజిని, ఆమె భర్త అనురాగారావు హాజరై తమను ఎవరూ అపహరించలేదని చెప్పారు. ఈ వివరాలను జస్టిస్‌ యు దర్గాప్రసాదరావు, జస్టిస్‌ జగడం సుమతితో కూడిన డివిజన్‌ బెంచ్‌ రికార్డు చేసి పిటిషన్‌పై విచారణను మూసివేసింది. నగరంపాలెం పోలీసులు రజినిని అపహరించారని ఆరోపిస్తూ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పఠాన్‌ అస్మతులా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు మూసేసింది.

➡️