రేపు సీఎల్పీ భేటీ.. కాళేశ్వరం అక్రమాలపై శ్వేతపత్రంపై చర్చ..!

Feb 10,2024 12:42 #Telangana

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్న నేఫథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం కానుంది. ఈ నెల 12న అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

➡️