వివాహ వేడుకలో సిఎం జగన్‌

Feb 15,2024 20:15 #ap cm jagan, #Kurnool

ప్రజా సంఘాలకు ముందస్తు నోటీసులు

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌/కార్పొరేషన్‌  :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించారు. కోడుమూరు రోడ్డులోని కింగ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి మనవడు పవన్‌ కల్యాణ్‌ రెడ్డి వివాహానికి హాజరయ్యారు. వధువరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, గుమ్మనూరు జయరాం, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గన్నారు. సిఎం జగన్‌ కర్నూలుకు వస్తున్న సందర్భంగా పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. ఆవాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, నాయకులకు ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఎక్కడికి పోకూడదని హుకుం జారీ చేశారు. కర్నూలులో ఆవాజ్‌ నగర కార్యదర్శి ఎస్‌ఎండి షరీఫ్‌, నగర కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, నగర అధ్యక్షులు అమర్‌, ఎమ్మిగనూరులో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్‌, వీరేష్‌, ఆలూరులో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైన ఉపాధ్యక్షులు గోవర్ధన్‌, నాయకులు మల్లికార్జున షఫీ, ఆదోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులుకు ముందస్తు నోటీసులు ఇచ్చారు.

➡️