ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

Dec 24,2023 11:15 #ap cm jagan, #ysr

ప్రజాశక్తి-ఇడుపులపాయ : కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ముందుగా ఇడుపులపాయలో.. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించారు. అక్కడ జరిపిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వి.విజయ్ రామరాజు, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్‌ సురేష్‌ బాబు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌, ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ హేమచంద్రా రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి, తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. అనంతరం పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

➡️