కుప్పంకు నీటిని విడుదల చేసిన సిఎం జగన్‌

ప్రజాశక్తి – రామకుప్పం (చిత్తూరు) : కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా … సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి హంద్రీనీవా కృష్ణా జలాలకు జల హారతి ఇచ్చి, పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 11.05 గంటలకు రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా సిఎం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, నారాయణస్వామి, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నీటి వనరులు శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపిలు మిథున్‌ రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌, సుబ్రమణ్యం, జిల్లా కలెక్టర్‌ శన్మోహన్‌, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ముఖ్య మంత్రి కి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం 11.30 గంటలకు హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కఅష్ణా జలాలకు జల హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై హెలికాప్టర్‌ ద్వారా శంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గొనేందుకు వెళ్ళారు.

➡️