మహాత్మాగాంధీకి సీఎం జగన్‌ నివాళి

Jan 30,2024 11:52 #ap cm jagan, #Gandhiji, #vardanti

ప్రజాశక్తి-అమరావతి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపి వి.విజయసాయిరెడ్డి, వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ”సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను” అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

➡️