సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి సభకు వచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఇన్వైటీ వంశీచంద్‌ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ భేటీలో ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి పాల్గొననున్నారు.

➡️