కూలిన నిర్మాణంలో వున్న వంతెన.. తప్పిన ప్రమాదం..

పెద్దపల్లి :మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో నిన్న (సోమవారం) అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడూరు-భూపాలపల్లి జిల్లా గుర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరతతో వంతెన నిర్మాణం ఆగిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️