డీఎస్పీల బదిలీలపై.. సీఈసీకి అచ్చెన్న ఫిర్యాదు

Feb 4,2024 13:02 #achennaidu, #TDP

ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల్లో వైసిపి లబ్ధి చేకూర్చేలా డీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. 42 మంది బదిలీలపై విచారణ జరపాలని లేఖలో కోరారు. 10 మంది పేర్లు, వారిపై ఉన్న అభియోగాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని తిరుపతి కలెక్టర్‌ లక్ష్మీశ కలవడంపైనా అచ్చెన్న ఫిర్యాదు చేశారు. ఆయనను బదిలీ చేసి, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ” ప్రొటోకాల్‌ పక్కన పెట్టి ఎమ్మెల్యేను కలెక్టర్‌ కలిశారు. గత ఎన్నికల్లో భూమన తక్కువ మెజార్టీతో గెలిచారు. లక్ష్మీశ నిష్పక్షపాతంగా ఉంటారనే నమ్మకం మాకు లేదు” అని పేర్కొన్నారు.

➡️