విశాఖ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై సమగ్ర దర్యాప్తు : మహిళా కమిషన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖ గ్యాంగ్‌ రేప్‌ ఘటన కేసును రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలపై నివేదిక ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ విశాఖ నగర పోలీస్‌ కమిషనరుకు సోమవారం లేఖ రాశారు. గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతోపాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని విశాఖ పోలీస్‌ కమిషనరుకు సూచించారు.

➡️