ముగిసిన ‘టెన్త్‌’ మూల్యాంకనం

Apr 9,2024 07:39 #10th exams

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదోతరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ముగిసింది. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానంద రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 జిల్లాల్లో హెడ్‌క్వార్టర్స్‌లో మూల్యాంకనం జరిగిందని పేర్కొన్నారు. 47,88,738 ప్రశ్నాపత్రాలను 25 వేల మంది సిబ్బందితో పూర్తిచేశామని వెల్లడించారు. మూల్యాంకన కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన అన్ని వసతులూ కల్పించామన్నారు. ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేస్తామని వెల్లడించారు.

➡️