వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి

Dec 6,2023 11:48 #death, #Telangana

ఖమ్మం : వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నూకతోటి పుల్లారావు(40), నూకతోటి లక్ష్మి(30) కూలీలుగా జీవనం సాగించేవారు. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి వారి ఇంటి స్లాబు ఒక్కసారిగా కూలిపోవడంతో భార్యాభర్తలిద్దరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు చేరుకొని వారిని బయటకు తీసుకొచ్చి 108కు సమాచారం ఇచ్చారు. వాహన సిబ్బంది వచ్చి పరిశీలించగా.. అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. వీరి మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. వీరికి సంతానం లేరని గ్రామస్థులు తెలిపారు.

➡️