అర్థరాత్రి వేళ ఆపదలో యువకులు – అండగా నిలిచి ఆదుకున్న సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు

విఆర్‌.పురం (రాజమండ్రి) : సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా.రామారావు మానవత్వాన్ని చాటారు. గురువారం అర్థరాత్రి సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగి ఆపదలో ఉన్న యువకులను గమనించి వెంటనే వారిని స్వయంగా తన భుజాలపై వేసుకొని తన వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించి అడ్మిట్‌ చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు నిన్న కూనవరం మండలంలో ప్రచారం ముగించుకుని రంపచోడవరం వెళుతున్న క్రమంలో …. విఆర్‌పురం మండలం అన్నవరం బ్రిడ్జి వద్ద యాక్సిడెంట్‌ అయి గాయాలతో పడిఉన్న యువకులను గమనించారు. బ్రిడ్జి కిందికి దిగి తానే స్వయంగా గాయపడిన యువకులను భుజం పై వేసుకొని ఎత్తుకొనివచ్చి తన వాహనంలో పెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్‌ చేశారు. రేఖపల్లి గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కు యువకులను తీసుకొచ్చి మానవత్వం చాటుకున్నారు. కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితయ్యి… ప్రజల బాధను చూసీచూడనట్లుగా ఉండకుండా, అర్థరాత్రి ఎవ్వరూ పట్టించుకోని స్థితిలో ఆపదలో ఉన్న ఆ యువకుల విషయంలో సిపిఎం నేత చూపిన బాధ్యత, మానవతా సిపిఎం నిబద్ధత గురించి తెలియజేస్తుంది.

➡️