యెర్నేని సీతాదేవి మరణం పట్ల సిపిఎం సంతాపం

May 27,2024 15:26 #CPM AP, #CPM AP State Committee

ప్రజాశక్తి-విజయవాడ : మాజీమంత్రి, విజయ డైరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆమె భర్త, రైతు ఉద్యమ నాయకుడు యెర్నేని నాగేంద్రనాధ్‌ ఇటీవలే మరణించారని తెలిపారు. వీరిరువురూ రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాడ సానుభూతి తెలియజేసింది.

➡️