కోటి టన్నుల ‘అక్రమ టెండర్’ ను రద్దు చేయాలి

cpm demand on mining auction in atp

బరైటీస్ అక్రమ టెండర్ పై సిపిఎం డిమాండ్ 
ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మంగంపేట బెరైటీస్ అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎండిసి  మంగంపేట బెరైటీస్ సి అండ్ డి గ్రేడ్ నిల్వలో కేవలం 75 లక్షల టన్నులు మాత్రమే స్టాక్ యార్డ్ లో ఉంటే ఇంకా తీయని 25 లక్షల మెట్రిక్ టన్నులకు పారదర్శకత లేకుండా అక్రమంగా టెండర్లు పిలవడం వెనుక అంతర్యం ఏమిటి ఎండీ అని ప్రశ్నించారు.అధికార పార్టీ తమకనుకూలంగా గంప గుత్తుగా  బడా కంపెనీ లకు ముందే నిర్ణయించుకున్న వారికి కట్టబెట్టడానికి టెండర్ షెడ్యూల్ పెట్టారన్నారు సామాన్యులకు అందుబాటులో లేకుండా, 30 లక్షల కడితేనే, టెండర్ డాక్యుమెంటరీ, డౌన్లోడ్ లభ్యమవుతుందన్నారు. పారదర్శకత గురించి మాట్లాడే వైసిపి ప్రభుత్వం, ఎందుకిలా చేసిందని ప్రశ్నించారు.ఇప్పటికే స్థానికులు మధ్యతరగతి కుటుంబాలు కట్టుకున్న  బరైటీస్ మిల్లులో మూతపడ్డాయన్నారు. గతంలో ఎక్స్పోర్ట్ కంపెనీలకు 60 శాతం స్థానిక మిల్లులకు 40% ముడి సరుకు ఇచ్చేవారని,  దాన్ని పూర్తిగా రద్దు చేశారన్నారు. దీని ఫలితంగా  మిల్లులు మూతపడి, 30 వేల మంది దాకా ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కోల్పోయారన్నారు. గత టిడిపి ప్రభుత్వంలోనూ, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం లోను, ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా, రాజకీయ రికమండేషన్లతో, ఏపీఎండిసి యాజమాన్యం వేల టన్నులు,కోట్ల రూపాయలు, అప్పులు ఇచ్చారని,  వసూలు చేయకుండా,సంస్థను దివాలా  తీస్తున్నారన్నారు. కార్మికుల జీతాలు పెంచమంటే మీనమేషాలు లెక్కిస్తారని, కార్మికుల శ్రమతో ఉత్పత్తి అయిన, సంపదను, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, తమకు కావలసిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే   మైనింగ్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్, ఉత్పత్తి, తగ్గిపోయిందన్నారు.  బరైటీస్ అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. కారు చౌకుగా సరుకు అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి లింగాల యానాదయ్య, మండల నాయకులు,పి జాన్ ప్రసాద్,పి మౌలాలి ఖాన్, ముత్యాల శ్రీనివాసులు,బండారు రాజశేఖర్,డి. శంకర్ రాజు, ఎం. విజయ్ తదితరులు పాల్గొన్నారు.

➡️