విజయవాడ సెంట్రల్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌ పలు డివిజన్‌లో ఇండియా బ్లాక్‌ తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇతర కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజ్యాంగ పరిరక్షణ హక్కుల పోరాట కమిటీ ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈనెల 13న జరిగే పోలింగ్‌ రోజున సిపిఎం అభ్యర్థి ఇండియా బ్లాక్‌ బలపరిచిన చిగురుపాటి బాబురావుకు ఓటు వేసి విజయం సాధించాలని అభ్యర్థి చిగురుపాటి బాబురావు, ఇతర పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఇండియా బ్లాక్‌ అభ్యర్థుల గెలుపు దేశాభివృద్ధికి మలుపు అని నినదించారు. మోడీ బిజెపి దాని మిత్రపక్షాలను ఓటు అనే ఆయుధం ద్వారా చిత్తుగా చిత్తుగా ఓడించాలని నియంతృత్వ వైసిపిని మట్టికరిపించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️