అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

May 13,2024 23:42 #candidates, #Cross voting

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘క్రాస్‌ ఓటింగ్‌’ అభ్యర్థులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో అటు పార్లమెంట్‌కు, ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగటంతో ఓటర్లకు రెండు ఓట్లు వేసే అవకాశం వచ్చింది. దీంతో ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీ అభ్యర్థికి, ఎంపి ఓటు మరో అభ్యర్థికి వేసే అవకాశం లభించింది. అనేకచోట్ల ఆ తరహాలో పోలింగ్‌ జరిగిందంటూ వస్తున్న సమాచారం ఎన్‌డిఎ కూటమితో పాటు, వైసిపి అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
కూటమిలో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన చోట క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని చెబుతున్నారు. కొన్ని చోట్ల కూటమి ఓట్లు బదిలీ కాలేదని అంటుండగా, మరికొన్ని చోట్ల పార్టీల కతీతంగా ఒక సామాజిక తరగతికి చెందిన వారందరూ ఆ పార్టీకి ఓటు వేశారని అంటున్నారు. కాకినాడ, మచిలీపట్నం వంటి చోట్ల ఈ పరిస్థితి విజయావకాశాలను సైతం ప్రభావితంచేసేలా ఉందని సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో జనసేకు వేసిన వారు పార్లమెంటుకు వేరే పార్టీకి వేసినట్లు చెబుతున్నారు.
ఒకే రకమైన గుర్తులతో…
జనసేన పోటీలో లేని చోట గాజుగ్లాసును ఎన్నికల కమిషన్‌ ఫ్రీ సింబల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లను గందరగోళానికి గురిచేసింది. కొన్ని చోట్ల గ్లాసును పోలి ఉండే బక్కెట్‌, పెన్నులు పెట్టుకునే హోల్డర్‌ను కేటాయించింది. అలాగే పలు చోట్ల దాదాపుగా ఒకే పేరుగల వారు అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఇవి కూడా ఓటర్లను అయోమయానికి గురిచేశాయి,

➡️