బాపట్ల దగ్గరలో తీరం దాటనున్న ‘మిచౌంగ్‌’ తుఫాన్‌

అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాను (మిచౌంగ్‌)గా బలపడింది. ప్రస్తుతానికి నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో తుఫాన్‌ కేంద్రీకృతమైంది. మంగళవారం మధ్యాహ్నంలోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుఫానుగా మిచౌంగ్‌ తీరం దాటనుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా అప్డేట్‌ ను విడుదల చేసింది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

➡️