ప్రజాక్షేత్రంలో చంద్రబాబు కూటమి ఓటమి ఖాయం

May 7,2024 14:47 #cm
  • ఎన్నికల ప్రచార సభల్లో సిఎం వైఎస్‌ జగన్
    రాజానగరం : గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఆఖరి నెలలో తనను కట్టేడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా! ఓటు అనే ఆస్త్రంతో గట్టిగా బుద్ది చెబుతారని వైసిపి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం పేరుతో వైసిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలు మంగళవారంనాడు రాజానగరం, ఇచ్చాపురం, విశాఖపట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఐదేళ్ల సంక్షేమ పాలన చూసిన ప్రజానీకం తిరిగి తన విజయాన్ని కోరుతున్నారన్నారు. జూన్‌ 4న మళ్లీ అధికారంలోకి వచ్చేది నేనన్నారు. వారం రోజుల్లో ఈ బటన్ల్ని నొక్కి పథకాలను క్లీయర్‌ చేస్తానన్నారు. చంద్రబాబునాయుడు. పవన్‌ కళ్యాణ్‌, బిజెపి నాయకులు ఢల్లీీకి వెళ్లి కుట్రలు చేసి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను తిరిగి అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న పథకాల మొత్తాన్ని తిరిగి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అవ్వాతాతలకి ఇంటికి వచ్చే పింఛన్‌ రాకుండా చేసి వృద్ధులను ఇబ్బందులు పెడుతుండటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇన్ని నెలలుగా నేరుగా పింఛన్‌ ఇంటికే పంపించామనీ, ఇప్పుడు వారంతా రెట్టించిన ఉత్సాహంతో తనకే ఓటు వేస్తారన్నారు. అక్కచెల్లమ్మలకు చేరాల్సిన పథకాల రాకుండా ఢలీీకి వెళ్లి కుట్రలు చేస్తు పథకాలను అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్న వారిని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఇవి కొత్తగా వచ్చిన పథకాలు కాదనీ, ప్రతి సంవత్సరం అమలు చేసే పథకాలను అడ్డుకోవటం ఏమంత సమంజసం కాదని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌లో ఆమోదించిన పథకాలను సైతం అడ్డుకోవటం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. డిల్లీలో కుట్రలు పన్ని జగన్‌ను కట్టడి చేసి, అక్కచెల్లమ్మల కుటుంబాలకు అందించే సొమ్మును అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏ నెల ఏ పథకం ఇస్తారో తెలియజేస్తూ ప్రతి ఇంటికి క్యాలెండర్‌ పంపించి తెలియజేసిన ప్రభుత్వం తనదేనన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ను విమర్శించేది మూర్ఖులే…ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అర్ధంకాని మూర్జులు అసత్యాలతో రైతులు, భూయజమానులను గందరగోళంలో పడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సిఎం చంద్రబాబు విమర్శించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై మరో దుష్ప్రచారాన్ని చంద్రబాబు చేస్తుండటం దుర్మార్గ పూరితమన్నారు. దీనిపై ప్రతి ఒక్కరికీ కాల్స్‌ కూడా చేసి అబద్ధాలను ప్రచారం చేశారన్నారు. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసేవారి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కి అర్ధం తెలుసా?అని ప్రశ్నించారు. భూ యాజమానులకు టైటిల్‌ ఉండేలా ఒక చట్టం తీసుకురావటమే దీని ఉద్దేశ్యమన్నారు. భూమి ఆమ్మాలన్న, కొనాలన్న తెలియని భయంతో వెనకడుగు వేస్తున్నారన్నారు. సర్వేలు లేకపోవటం వల్ల వివాదాలతో కోర్టులు చుట్టూ తిరుగుతున్నారన్నారు. వీరికి మనశ్శాంతిని ఇచ్చి, ప్రతి ఒక్కరూ తమ భూమలు పై సంపూర్ణ హక్కులు ఉండేలా ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వటమే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ లక్ష్యమని వివరించారు.
➡️