నిర్వీర్యమైన సాగునీటి ప్రాజెక్టులు

May 3,2024 22:14
  •  కూటమి నేతల విమర్శ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రివర్స్‌ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టులను సిఎం జగన్‌ నిర్వీర్యం చేశారని కూటమి నేతలు విమర్శించారు. టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు పలువురు కూటమి నేతలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులను ఎండగట్టి, పోలవరాన్ని నట్టేట ముంచి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారని విమర్శించారు. జగన్‌కు ముస్లిం రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మరో సమావేశంలో విమర్శించారు. ఓటరు స్లిప్‌ పంపిణీ వ్యవహారంపై ఆర్‌ఒలకు సరైన డైరెక్షన్‌ ఇవ్వాలని సిఇఒ ఎంకె మీనాను టిడిపి కోరింది. సచివాలయంలో మీనాను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతోపాటు పలువురు కలిసి వినతిపత్రం అందించారు. వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ నెల్లూరు రూరల్‌, రాజమండ్రి సిటీ డిఎస్‌పిలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️