ఢిల్లీలో ప్రత్యేక హోదా-విభజన హామీల సాధన సమితి ధర్నా

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ … ఢిల్లీ ఎపి భవన్‌ వద్ద  ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. ప్రత్యేక  హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చలసాని శ్రీనివాస్‌, సిబిఐ మాజీ డైరెక్టర్‌ జెడి లక్ష్మి నారాయణ, విద్యార్థి సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

cpm sitaram yechury on visakha steel plant

 

➡️