మా వాళ్ళని పరామర్శించాలంటే పర్మిషన్‌ ఇవ్వారా?: టిడిపి అభ్యర్థి జూలకంటి

May 23,2024 13:28 #palanadu, #TDP

ప్రజాశక్తి-మాచర్ల : మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు కొంతమంది పోలీసుల ఫెయిల్యూరే కారణమని ఎమ్మెల్యే ముందస్తుగా హెచ్చరించి దాడులకు దిగినా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన మా వాళ్ళని పరామర్శించాలంటే పర్మిషన్‌ ఇవ్వారా..? అని ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితిలోనే నేటి మాచర్ల పర్యటన వాయిదా వేసుకున్నానని పేర్కొన్నారు. రెండు రోజుల్లో పోలీస్‌ పర్మిషన్‌ తీసుకొని మాచర్ల పర్యటనకు వెళ్తానని చెప్పారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం రావాలంటే రెచ్చగొట్టే నాయకులు మాచర్ల బయట ఉండాలని.. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని డిమాండ్‌ చేశారు.

➡️