టిటిడి ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ

Dec 28,2023 20:50 #house sites, #ttd employees

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో వెనుకడుగు వేసేది లేదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడతగా 3518 మంది టిటిడి ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తే చట్టప్రకారం ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంతో నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. ఏర్పేడు మండలం పాగాలి వద్ద 350 ఎకరాల భూమి టిటిడికి ఇవ్వడంలో జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి కృషి అభినందనీయమన్నారు. ఇందుకోసం ధర్మకర్తల మండలి సమావేశంలో 87 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ఇఒ ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఉద్యోగులతో తమకున్న బంధాన్ని విడదీయలేరని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

➡️